అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయితీలో బుధవారం ఏపీ కి మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఎంపీపీ అనూషా దేవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరణ, సచివాలయం పరిధిలో ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిన లబ్ధి గురించి బోర్డు డిస్ప్లే చేసి వివరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు మంచి చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న వైయస్సార్ ప్రభుత్వం అని, గతంలో 600 హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేని ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అయితే, ఇచ్చిన హామీలే కాకుండా మరికొన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు. గతంలో టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా టిడిపి,జనసేన పార్టీలు పొత్తుతో రావడం జరిగిందని అప్పట్లో ప్రకటించిన మేనిఫెస్టోకి కూడా పవన్ కళ్యాణ్ నేను హామీ అని అన్నారని, చంద్రబాబు ఇచ్చిన హామీలనే నెరవేర్చక పోగా పవన్ కళ్యాణ్ నే పక్కకు పెట్టేసిన సందర్భం ప్రజలంతా గమనించారని, ఈసారి కూడా అలాగే టిడిపి, జనసేన పొత్తుతో రావడం జరుగుతుందని, ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించినా కేవలం అధికారం కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారు తప్ప ప్రజలకు మంచి చేసే దిశగా వారి ఆలోచన ఉండదని మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి అన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చలేని గత ప్రభుత్వాల కంటే, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని, ఇది కేవలం ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఆలోచించే ప్రభుత్వమని, ఇది ప్రజా ప్రభుత్వమని, కనుక ప్రజా ప్రభుత్వమే మళ్లీ రావాలని మోరి రవి అన్నారు. కనుకనే ఏపీకి మళ్లీ జగనే సీఎం కావాలని రవి అన్నారు. ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి పై ఇలాగే ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రై కార్ డైరెక్టర్ లోవరాజు, సచివాలయ మండల కన్వీనర్ గుణబాబు, నాయుడు,అప్పన్న, సర్పంచ్ సత్యనారాయణ, బద్రి, సన్యాసిరావు, కన్వీనర్లు, గృహసారథులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.