Breaking News

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే

0 19

 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాడేరు ఎమ్మెల్యే కొట్టకులే భాగ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు నేరుగా అందించడంలో వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.ఈ సందర్భంగా ఒకరికి సేవా వజ్ర, ఐదుగురికి సేవా రత్న,123 మందికి సేవామిత్ర అవార్డులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు, ఎంపీపీ బడుగు రమేష్,జడ్పిటీసీ వారా నూకరాజు, చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీ లు అప్పన వెంకటరమణ, అంబటి నూకాలమ్మ, రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి, రాష్ట్ర బీసీ డైరెక్టర్ గాడి నాగమణి, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు గొడ్డేటి మహేష్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ధోని బాబ్జి,సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు,పి.మాకవరం ఎంపీటీసీ మల్లీశ్వరి,బూదరాళ్ళ ఎంపీటీసీ కుమారి,సర్పంచ్ కోడా చింతల్లి, మండల నాయకులు గాడి సత్యనారాయణ, బండి సుధాకర్,రీమల గంగాధర్, పాటి శేఖర్,కోడా రాజబాబు, ఎంపీడీఓ మేరీరోజ్ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.