Breaking News

హాస్పిటల్స్ లో ఆశా వర్కర్లతో వెట్టిచాకిరీ చేయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది: కొయ్యూరు ఎంపీపీ

0 55

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: కొన్ని పిహెచ్సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదని ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో సర్పంచులు దుయ్యబట్టారు.కంఠారం పీహెచ్సీలో నిబంధనలకు విరుద్ధంగా ఆశా వర్క్స్ ను వైద్యం అందించాలని ఆదేశించి వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయమై ఎంపిపి రమేష్ స్పందించి ఆశా వర్కర్స్ తో వెట్టిచాకిరి చేయించుకోవడం నిబంధనలకు విరుద్దమని,వాళ్లకు వచ్చే చాలీచాలని జీతాలతో డ్యూటీలు చేస్తున్నారని గుర్తించాలని,గిరిజన ప్రాంతంలో గిరిజన మహిళలను వైద్యాధికారులు ఇలా అవమానించడం సరైన పద్దతి కాదని,పద్దతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఎంపీపీ హెచ్చరించారు. అపరిశుభ్రంగా ఉన్న హాస్పిటల్స్ కమిటీలకు సంబంధం లేకుండా శుభ్రం చేయించాలని.. అందుకే పిహెచ్సీలకు రోగులు రావడానికి బయపడుతున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.