Breaking News

జగనన్న పాలనలో ప్రతి గడపలోనూ వెలుగులు-పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.

0 19

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి గడపలోనూ వెలుగులు నింపారని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం నడింపాలెం గ్రామ సచివాలయం పరిధిలోని పెదమాకవరం, కత్తెరలొద్ది గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడేరు శాసనసభ్యులు  కొట్టగుల్లి భాగ్య లక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరై గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 196 గడపలను సందర్శించారు. ప్రతి గడపలోనూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిని పలకరిస్తూ ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఆమె దృష్టికి వచ్చిన సమస్యలను కొన్నింటిని పరిష్కరించారు. ఆర్థికపరమైన వాటితో ముడిపడి ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బడుగు, బలహీన వర్గాలు గిరిజనులు, ఎస్సీలు ఇలా ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు చేకూరాయని తెలిపారు. సంక్షేమ పథకాల రూపంలో ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి గా కాకుండా తమ కుటుంబంలో  ఓ అన్నగా,తమ్ముడుగా,కుటుంబ పెద్దగా, మామయ్యగా వారి కుటుంబ సభ్యులుగా మారిపోయారని తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు,సర్పంచ్ సెగ్గే నూకాలమ్మ,ఎంపీటీసీలు సెగ్గే మల్లీశ్వరి, అప్పారావు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు రాజకుమారి,ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పిటిసి వారా నూకరాజు, ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ, రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి, వైస్ ఎంపీపీలు అప్పన వెంకటరమణ, అంబటి నూకాలమ్మ,సచివాలయ మండల కన్వీనర్ బండి సుధాకర్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షులు గొడ్డేటి మహేష్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ధోని బాబ్జి, మండల మహిళా అధ్యక్షురాలు సడ్డా సావిత్రి, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్,సర్పంచులు, ఎంపీటీసీలు,అలాగే నాయకులు కాళ్ళ  వనుంబాబు,పాటి శేఖర్,కొర్రా తిరుపతి,దూరి గంగరాజు,రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.