Breaking News

ప్రజాసేవలో నిర్లక్ష్యం వహించొద్దు- పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి

0 70


అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని పాడేరు ఎమ్మెల్యే కొటగుళ్లి భాగ్యలక్ష్మి హెచ్చరించారు. కొండగోకిరి సచివాలయాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..కొయ్యూరు మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పటి వరకు 14 గ్రామ సచివాలయాల నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసుకోవడం ప్రారంభించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చెప్పారు.
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పాలనలో వచ్చిన మార్పులను గత ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. గతంలో ఏ పని జరగాలన్నా మండల కేంద్రానికి వచ్చి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నుంచి నేడు మీ గ్రామానికి అధికారులను తీసుకొచ్చి పాలనను ప్రజలకు చేరువ చేసిన ఈ వ్యవస్థ అత్యద్భుతంగా పనిచేస్తుందన్నారు. ఇంత చక్కటి పారదర్శక పాలనను అందించేందుకు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి గిరిజనుల అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.


ఈరోజు ప్రజలకు ఏ పని చేసుకోవాలన్నా మీ గ్రామ పంచాయతీలో ఉన్న సచివాలయంలో పూర్తయిపోయే వ్యవస్థను రూపొందించారని చెప్పారు. వివిధ అవసరాలు సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చే ప్రజలు చెప్పే విషయాన్ని విని వాటి పరిష్కారానికి త్రికరణ శుద్ధితో ప్రయత్నం చేయాలని సచివాలయ సిబ్బందికి శాసనసభ్యులు సూచించారు. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఏ మాదిరిగా అందించగలమో వాలంటీర్ వ్యవస్థను వినియోగించుకొని వాళ్లకు అవగాహన కల్పించి వాళ్ళని నడిపించాల్సినటువంటి బాధ్యత సచివాలయ సిబ్బంది తీసుకోవాలన్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన సచివాలయ సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వహించినా వ్యక్తిగత ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక భూమిక పోషిస్తున్న వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది,ప్రభుత్వ ఉద్యోగులందరికీ గిరిజనుల అందరి తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు రేగటి ముసలి నాయుడు,పాటి నూకరత్నం,రీమల శ్రీను,వైస్ సర్పంచ్ కొమరపు బాబూజీ,ఎంపిటీసిలు సడ్డా మల్లీశ్వరి,సచివాలయ కన్వీనర్స్ పాటి శేఖర్, ఎంపీపీ బడుగు రమేష్,జడ్పీటిసి వారా నూకరాజు,మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు,వైస్ ఎంపీపీలు అప్పన్న వెంకటరమణ,అంబటి నూకాలమ్మ,జేసీఎస్ మండల కన్వీనర్ బండి సుధాకర్,సర్పంచులు ఎన్ శోభన్,కూడా రాజబాబు,పెంటమ్మ,రాజకుమారి,జంపా కన్నయమ్మ, ఎఎంసి చైర్మన్ జైతి రాజులమ్మ,ట్రైకార్ డైరెక్టర్స్ సుమర్ల సరస్వతి, ఎంపిటిసి బిడిజన అప్పారావు,సోషల్ మీడియా కన్వీనర్ గాడి అచ్చిరాజు,నాయకులు వై రామరాజు,కినపర్తి శ్రీను,వార్డ్ మెంబర్ కె గంగారత్నం,సచివాలయం సిబ్బంది,గ్రామ వాలంటీర్లు,గృహసారథులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.