*మళ్లీ జగనే కావాలి.
*సంక్షేమ పథకాల రూపంలోనే నడింపాలెం సచివాలయం నందు 15 కోట్లు పై చిలుకు ఖర్చు.
-‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: “మాకు మళ్ళీ జగనే సీఎంగా కావాలి. సంక్షేమ,అభివృద్ధి పాలనతో రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా మార్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని పాడేరు నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు అని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. కొయ్యూరు మండలం నడింపాలెం గ్రామ సచివాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి.. పల్లెకు పోదాం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సచివాలయం పరిధిలో 32 సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక సహకారం అందించిన వివరాలను గణాంకాలతో సహా కూడిన బోర్డును ఏర్పాటు చేశారు. అనంతరం వైఎస్ఆర్సిపి జెండా పతాకావిష్కరణను నిర్వహించారు. ప్రజలతో కలిసి వివిధ కులాల పెద్దలు,గ్రామ పెద్దలు,నాయకులు అందరితో కలిసి సమావేశం నిర్వహించి అక్కడ జరిగిన అభివృద్ధిని వివరించి ఇంకా చేపట్టి తెలిసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ చూడండి… ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి పనులు చేపట్టారు… గ్రామంలో వేలకోట్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మహా యజ్ఞంలా సాగే సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
నడింపాలెం సచివాలయం పరిధిలో ప్రజలకు నాలుగేళ్ల కాలంలో రూ.15 కోట్లకు పైబడి ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో వేసిందని చెప్పారు. ఈ సచివాలయం పరిధిలో అమ్మఒడి కింద రూ.1.10 కోట్లకు పైబడి పేదల తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోకి వేయడం జరిగిందన్నారు. సుమారుగా 505 మందికి రూ.4.92కోట్లు ఈ సచివాలయం పరిధిలో వివిధ రకాల పెన్షన్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇదొక పెద్ద విజయం అని పేర్కొన్నారు. సంపూర్ణ పోషణ,ఇళ్లస్థలాలు వంటివి అదనంగా మరో ఏడు కోట్లకు పైబడి ఈ గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. నాలుగున్నరేళ్ల వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను నూరు శాతం అమలు చేసి వృద్ధిరేట్లో దేశంలోని రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా చేశారన్నారు. నియోజకవర్గంలో నాడు – నేడు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ క్లినికల్ తో పాటు అనేక అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని చెప్పారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ద్వారా ఆయా సచివాలయాల్లో ఏం చేశారో ప్రజలకు తెలియజేయడంలో శ్రేణులు కీలకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో జగన్ వల్ల జరిగినటువంటి మేలుని వివరించి మరోసారి ఆశీర్వదించేలా అవగాహన కల్పించాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపిస్తేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఇంత మేలు చేసిందన్న విషయం ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని అప్పుడే టిడిపి, జనసేన చేస్తున్న అబద్ధపు ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, పనసల వెంకటలక్ష్మి,సెగ్గే నూకాలమ్మ, స్థానిక ఎంపీటీసీ లోకుల సోమాగాంధీ,,ఎంపీపీ బడుగు రమేష్, జడ్పిటిసి వారా నూకరాజు,వైస్ ఎంపీపీలు అప్పన వెంకటరమణ, అంబటి నూకాలమ్మ,మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు, చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,జేసీఎస్ మండల కన్వీనర్ బండి సుధాకర్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు నీలాపు సూరిబాబు,సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు, పి ఏ సి ఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు, ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి, ఎంపిటిసి బిడిజన అప్పారావు,మల్లేశ్వరి,మహిళా అధ్యక్షురాలు సావిత్రి ,సర్పంచులు ఎన్ శోభన్, కూడా రాజబాబు,కె.పెంటమ్మ,రాజ కుమారి ,జంపా కన్నయమ్మ,సత్యనారాయణ,రీమల శ్రీను,వెంకటలక్ష్మి,నూక రత్నం, శ్రీను,కిముడు సత్యనారాయణ,నూకరత్నం,వెంకటరమణ,సోషల్ మీడియా కన్వీనర్ గాడి అచ్చిరాజు,నాయకులు వై.రామరాజు, వైసీపీ నాయకులు పాటి శేఖర్,శ్రీను, తిరుపతి,అబ్బాయి దొర,ఎస్.రామారావు, ఎం.శంకరయ్య,పెంటయ్య,సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు,గృహసారథులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.