Breaking News

ప్రమాదవశాత్తూ మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్టీ కమిషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

0 50

ప్రమాదవశాత్తూ మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్టీ కమిషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం,చింతపల్లి మండలం: అన్నవరం గ్రామానికి చెందిన గెమ్మెలి రాజేష్ అనే వ్యక్తి సోమవారం వారపు సంత కావడంతో వారి దుకాణంలో ఈరోజు తెల్లవారు జామున తిను బండారాలు తయారు చేయుటకు పొయ్యిపై ఆయిల్ పాత్ర వేడి చేస్తూ ఉంటుండగా పాత్ర అదుపు తప్పిపోవడంతో ఒక్కసారిగా మంటలు పుట్టడంతో దుకాణం మొత్తం దగ్దం కావడంతో రాజేష్ కావ్య దంపతుల కుమార్తె రెండవ తరగతి చదువుతున్న చిన్నారి గెమ్మెలి రితికా అక్కడికక్కడే సజీవదహనం అయ్యింది.విషయం తెలుసుకున్న ఎస్టీ కమీషన్ మెంబర్ విశ్వేశ్వర రాజు హుటహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మరణం పట్ల ఆరాతీసి చలించిపోయి తీవ్ర దిగ్ర్భాంతి చెందరు.చిన్నారి కోల్పోయిన దుఃఖంతో విలపిస్తున్న తల్లీ తండ్రులకు కుటుంబ సభ్యులను ఓదార్చి విశ్వేశ్వర రాజు వారి కుటుంబానికి చిన్నారి దహన సంస్కారాలు ఖర్చులు నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.

Leave A Reply

Your email address will not be published.