Breaking News

ప్రజల నోట్లో మట్టి కొట్టడానికే టిడిపి డ్రామాలు.

0 20


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:

టీడీపీ పార్టీ కి సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదు. మీరు దైర్యం కోసం మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే అని కొయ్యూరు వైయస్సార్ పార్టీ నాయకులు టీడీపీ పార్టీ మండల నేతలను ఎద్దేవా చేశారు.

ర్యాలీ చేస్తే ఎందుకు ఉలికిపాటు..ముందుంది క్రోకొడైల్ ఫెస్టివల్ అన్నారు.

టీడీపీ పార్టీకి  కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం, 40సంవత్సరాల అనుభవంలో డొల్లతనం బయట పడిందని అన్నారు. ప్రజలకు మంచి చేసే వాడు అయితే అధికారంలో ఉన్న 14సంవత్సరాల కాలంలో  ఏమి చేసాడు అనే విషయం ప్రజలకు అర్థం అయింది అని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి ని, వైయస్సార్ పార్టీ విధానాలను, పక్క రాష్ట్రాల మేనిఫెస్టోను కాపీ కొడుతూ.. 

ప్రజలను కన్ఫ్యూజ్ చేసి దొంగ హామీలు చేసినంత మాత్రాన గతంలో నువ్వు ఇచ్చిన 600 హామీలను మరిచిపోయే జనం కాదని అన్నారు.

టీడీపీ పార్టీకి ప్రజలు చాలా సార్లు అవకాశం ఇచ్చారని, అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేని చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తాడు అనే నమ్మకం ప్రజలలో ఏ కొసానా లేదని, టిడిపి రాక్షస పాలన ప్రజలు కోరటం లేదని అన్నారు.

మళ్లీ ఆఫీసుల చుట్టూ ప్రదర్శన చేసి  పచ్చ నాయకుల చుట్టూ తిరుగుతూ,

టిడిపి హాయాంలో లంచాలు సమర్పించుకొని పనులు చేయించుకోవాలి తప్ప ఏమీ లేదని.. 

600 హామీలు ఇచ్చి ఏమీ చేయలేని మీరే సిగ్గు లేకుండా తిరుగుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శన చేస్తే ..

మేము మా ఆడపడుచులకు,ప్రతీ హామీ నెరవేరుస్తూ ప్రతి పథకం ఎవరి దగ్గరికి వెళ్లకుండా అర్హతను బట్టి కులం మతం రాజకీయం చేయకుండా అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మేము  ఇంకెన్ని కలల కనాలి అని వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలిపారు.

మీ రాజకీయ అనుభవంలో టిడిపి ఎప్పుడు సింగిల్ గా పోటీ చేయలేని మీరు దైర్యం కోసం మాట్లాడటం దెయ్యాల వేదాలు వల్లించడమే అని అన్నారు.

ప్రజలలో తిరిగే దమ్ము,దైర్యం వైయస్సార్ పార్టీకి తప్పా మరే ఇతర పార్టీకి లేదు అని ఆ అర్హత మీకు నాలుగేళ్ల క్రితమే పోయింది అని అన్నారు.

 గుండెలలో ధైర్యం,ప్రజల మద్దతు నిండుగా ఉన్న పాడేరు శాసన సభ్యురాలు భాగ్యలక్ష్మి ప్రతీ మండలానికి,పంచాయతీకి గడప గడపకు సుమారు 158 రోజులు 800వందల పైచిలుకు గ్రామాలు, ప్రతి గడపగడపకు తిరిగిన వ్యక్తి ధైర్యసాహశీలి భాగ్యలక్ష్మి అని,

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే లు ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటికి వెల్లిన విధంగా..

 ఈ డబ్బాలు కొట్టుకోనే పచ్చ పార్టీ వాళ్లు ప్రజల దగ్గరకు వెళ్ళకుండా తప్పించుకోవడం తప్పా..ప్రజల దగ్గరకు ఎమ్మెల్యే లను పంపించలేని టీడీపీ పార్టీ,దైర్యం కోసం మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

మా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి  కష్టపడుతుంది అనడానికి నిరంతరం గూడెం,చింతపల్లి, కొయ్యూరు,జి.మాడుగుల,పాడేరు ఇలా ప్రతీ రోజు ఏదో ఒక గ్రామానికి వెళ్లి వారి సమస్యలు వింటూ పరిష్కారానికి కృషి చేస్తున్న ఇలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకురాలు మా భాగ్యలక్ష్మి అని..కొండలు,కోనలు దాటుతూ ప్రతీ కుగ్రామానికి వెళ్ళినటువంటి ఘనత భాగ్యలక్ష్మి దని..

టిడిపి ని చూస్తుంటే కాచిన చెట్టుకే రాళ్లు దెబ్బలు.. నడిచే ఎద్దుకే పొడవడం అనే సామెత ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి టిడిపి వారికి వర్తిస్తుందని అన్నారు. 

చరిత్రలో ఎప్పుడైనా ఎమ్మెల్యే తిరగడం చూసారా? అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎమ్మెల్యే లు ఒకప్పుడు ….

ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో వైయస్సార్ పార్టీలో ప్రజల కొరకు కష్టపడటమే వైయస్సార్ పార్టీ జగనన్న సిద్దాంతం అని అన్నారు.

మీ తాటాకు చప్పులకు భయపడేదిలేదని..

మీరు అనుకున్నట్టు మహానాడుకు భయపడే చేసిన ర్యాలీ అని మీరు భావిస్తే మీరు అజ్ఞానులే అని అన్నారు.

ఎందుకంటే గతంలో ఈ మహానాడు లేకుండానే మీ మీద మేము చేసిన దండయాత్ర కొయ్యూరు నుండి కించువాణిపాలెం సంఘటన గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు.

ప్రజల్లో నిండుగా ఉన్న పార్టీ వైఎస్సార్ పార్టీ అని ఆంద్రప్రదేశ్ ఆడపడుచులుకు జగనన్న గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ళలో ఏమి చేసిందో, ఏమి ఇచ్చిందో ఒక్కసారి సచివాలయంలో ఉన్న లబ్ధి దారుల లిస్ట్ చదువుకుంటే మంచిది అని అన్నారు. 

గత టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక ఎకరం భూమికి అయినా పట్టా ఇచ్చిన సందర్భం ఉందా? ఈ టిడిపికి రైతులకు భరోసా గాని క్రాప్ ఇన్సూరెన్సులు గాని ఒక స్కూల్ బిల్లింగ్ గాని, ఒక పంచాయతీ ఆఫీస్ గాని చదువుకున్న పిల్లలకు కనీసం మంచి చదువు ఇవ్వాలని ఆలోచన చేయని మీరు నాయ బ్రాహ్మణు లకు, రజకులు కు,మత్యకారులకు,చేనేత కార్మికులకుఅలాగే ఆరోగ్య శ్రీ ఇలా ఏం చేశారని,108 వాహనాన్ని కూడా గత టీడీపీ పాలనలో గాలికి వదిలేసి ఇప్పుడు వచ్చి మేము అది ఇస్తాము,ఇది చేస్తాము అంటే ప్రజలు గొర్రెలు కాదు అని, చాలా తెలివైన వారు అని వైయస్సార్ పార్టీ నాయకులు వ్యక్తం చేశారు.

 జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమ్మవడి,రైతు భరోసా, ఇల్లు స్థలాలు పంపిణీ, పోడు రైతులకు పట్టాలు పంపిణీ, ఇంటి వద్దకు బియ్యం, ఉచిత బియ్యం ఇస్తుంటే,ఆటొ నడిపే అన్నకు,రజకులు కు,నాయి బ్రాహ్మణులు కు,పిల్లలు కు ట్యాబ్ లు,ఇంగ్లీషు మీడియం స్కూల్, వసతి దివేన, విద్యా దివేన, గిరిజన యూనివర్సిటీ,మెడికల్ కాలేజ్ లు,సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఇలా నూతన అధ్యయనం నకు నాంది పలుకుతు వైయస్సార్ ఆసర,చేయూత, కాపు నేస్తం, సున్నా వడ్డీ ,జగనన్న తోడు,విద్యా కానుక, ఇలా ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధి జగన్మోహన్ రెడ్డి ఇస్తుంటే చూసి ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

 వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే 

ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని, రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని ఈ ఎల్లో బ్యాచ్ టీడీపీ పార్టీ అర్థం పర్థం లేకుండా మాట్లాడారని అన్నారు.

ప్రజలకు మంచి చేస్తే శ్రీలంక అవ్వడం ఏమిటో, ప్రజలు సోమరిపోతులు అవ్వడం ఏమిటో అర్థం కావడం లేదని.. రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గం ప్రజలు ఒక్కసారి అలోచన చేయాలని అన్నారు.

భయం లేని జగన్ అనే సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది అని..  

భయం ఉన్న పచ్చ పార్టీ  గుంపులుగా వస్తున్నాయని కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్,మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,వైస్ ఎంపీపీ అప్పన వెంకట రమణ, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలినాయుడు, గాడి సత్యనారాయణ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.