Breaking News

కొయ్యూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన విశాఖపట్నం రేంజ్ డీఐజి.

0 70

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎస్ హరికృష్ణ ఐపీఎస్ ఈరోజు ఆదివారం కొయ్యూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డులు పరిశీలించిన డిఐజి సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెక్ పోస్ట్లు ఏర్పాటు గురించి తగిన సూచనలు ఇచ్చి గంజాయి అరికట్టుటకు వాహన తనిఖీలు ముమ్మరంగా చేయాలని అదేవిధంగా గంజాయి రవాణాలో ఉన్న వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా రాబోయే ఎన్నికల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. సమస్యాత్మక ప్రాంతాలను గురించి వివరాలు అడిగి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండలంలో మారుమూల గ్రామాలైన బూధరాళ్ళ, యు.చీడిపాలెం,మఠం భీమవరం పంచాయతీలలో గల గిరిజన సమస్యలు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. కమ్యూనిటీ పోలీసింగ్,ఫ్రెండ్లీ పోలీస్ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడం జరిగింది. కొయ్యూరు పోలీస్ స్టేషన్ సందర్శనలో విశాఖపట్నం రేంజ్ డిఐజి తో పాటు చింతపల్లి అడిషనల్ ఎస్పీ కె.శివప్రతాప్ కిషోర్ ఐపీఎస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.