Breaking News

మీరు అధికారులా? లేక టిడిపి నేతలా?రెవెన్యూ అధికారులపై నల్లగొండ గ్రామస్తులు మండిపాటు.

0 19


వైసిపి పార్టీకి చెందిన చింతపల్లి ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ నామినేటెడ్ పదవి చేస్తూ డీలర్ గా కూడా కొనసాగుతున్నారని కనుక ఆమెను డీలర్ గా తప్పించి వేరే డ్వాక్రా గ్రూప్ సభ్యురాలికి డీలర్ పదవి అప్పగించాలని కొంతమంది టిడిపి పార్టీకి చెందిన నేతలు స్పందనలో ఫిర్యాదు చేసిన మేరకు బుధవారం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని నల్లగొండ పంచాయతీ, గ్రామానికి కొయ్యూరు తహసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ రాజన్నదొర, పంచాయితీ వీఆర్వో ప్రసాద్ కలిసి వెళ్లి వైస్ సర్పంచ్ కి గాని, వార్డు మెంబర్లకు గానీ, గ్రామ ప్రజలకు, డ్వాక్రా మహిళలకు అందరికీ తెలియజేయకుండా కేవలం టిడిపి పార్టీకి చెందిన నేతలను మాత్రమే కలిసి పూర్తి స్థాయి ఎంక్వయిరీ చేయకుండా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్లిపోయారని, ఎవరి గురించి అయితే స్పందనలో ఫిర్యాదు చేశారో ఆమెకు కూడా తెలియజేయకుండా ఎంక్వయిరీ చేయడం ఏంటని, ఆర్ ఐ కి, విఆర్ఓకి కనీసం ఈ మాత్రం కూడా తెలియదా అని నల్లగొండ గ్రామస్తులు మండిపడ్డారు.మీరు అధికారులా? లేక టీడీపీ నేతలా?అని ప్రశ్నించారు.
 జైతి రాజులమ్మ డీలర్ గా కొనసాగడం తమకు అభ్యంతరం ఏమీ లేదని, డీలర్ గా ఉన్న ఏ రోజు తాను ప్రజలకు అందాల్సిన సరుకుల విషయంలో ఏ అక్రమాలకు పాల్పడలేదని, సరుకులు ఇచ్చే విషయంలో కూడా ఎప్పుడూ జాప్యం చేయలేదని అలాంటప్పుడు ఎటువంటి రీమార్క్ లేకుండా ఆమెను డీలర్గా ఎలా తప్పిస్తారని డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు, వైస్ సర్పంచ్, వార్డు మెంబర్లు తెలిపారు.డీలర్ గా రాజులమ్మ ఉండాలని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు గ్రామసభ నిర్వహించేటప్పుడు ఆ గ్రామసభకు ఎవరెవరిని పిలవాలో, ఎవరి సమక్షంలో ఎంక్వయిరీ చేయాలో ఆ మాత్రం తెలియకపోవడం బాధాకరమని అన్నారు. కేవలం టిడిపి పార్టీ వాళ్లకు మాత్రమే వత్తాసు పలికి ఈ విధంగా ఎంక్వైరీ చేయడం సరికాదని.. ఈ విషయానికి సంబంధించిన డ్వాక్రా మహిళలకు, అలాగే గ్రామస్తులకు, వైస్ సర్పంచ్,వార్డు మెంబర్లకు కూడా తెలియజేసి ఎంక్వయిరీ చేయాలని అన్నారు. కేవలం టిడిపి వాళ్లకు మాత్రమే కలిసి ఎంక్వైరీ రిపోర్ట్ పంపిస్తే ఈ పూర్తి విషయమై ఆర్ఐ, వీఆర్వో పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.