అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలంలోని సురేంద్ర పాలెం గ్రామం శివారులో నాటుసారా తయారీ బట్టీలపై దాడులు నిర్వహించి 1,200 లీటర్ల బెల్లం పులుపును కొయ్యూరు సీఒ స్వామి నాయుడు ఆధ్వర్యంలో ధ్వంసం చేశామని ఎస్సై రాజారావు తెలిపారు.
తమకు అందిన సమాచారం మేరకు,తమ సిబ్బందితో కలిసి సురేంద్ర పాలెం గ్రామ శివారులలో ఉన్న నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించామని చెప్పారు. ఈ దాడుల్లో బెల్లం పులుపుతో పాటు, నాటుసారా తయారు చేసే వంట సామాగ్రి,నిల్వ ఉంచే డ్రమ్ములను, తయారు చేసే బట్టీలను ధ్వంసం చేశామని చెప్పారు.అంతేకాకుండా నాటుసారా తయారు చేస్తున్న సురేంద్ర పాలెం గ్రామానికి చెందిన వారిని త్వరలో గుర్తిస్తామని తెలపడం జరిగింది.
జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు,ఆపరేషన్ పరివర్తనలో భాగంగా సీఐ ఏ.స్వామినాయుడు ఆధ్వర్యంలో కొయ్యూరు మండలంలో నాటుసారా నిర్మూలనకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఎవరైనా నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.