అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం సచివాలయం పరిధిలోని పి.మాకవరం లో నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి తో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా వలసంపేట సమీపంలో అనుకోకుండా ఏఎంసీ చైర్ పర్సన్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం రహదారి బురదమయం అవడంతో స్కిడ్ అయి కింద పడిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొయ్యూరు జడ్పిటిసి వార నూకరాజు, డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు.. ఏఎంసి చైర్ పర్సన్ రాజులమ్మ స్వగ్రామమైన నల్లగొండకు వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.తనకు ఏమీ కాదని త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు.