Breaking News

హుకుంపేట: పోలీసులు అక్రమ అరెస్టులు ఆపాలి-అర్జున్ రెడ్డి

0 18

హుకుంపేట: పోలీసులు అక్రమ అరెస్టులు ఆపాలి.

*హుకుంపేట ఎస్సై వైఖరి మార్చుకోవాలి.
-అర్జున్ రెడ్డి.

అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకువేలి నియోజకవర్గం,హుకుంపేట మండలం,ఓలుబెడ్డ ఆదివాసీల గ్రామంలో సెప్టెంబర్ నెలలో వంతల వేమేశ్వర్రావు,కిల్లొ రామన్న లను గంజాయి పంట వేశారని తప్పుడు కేసు నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిందని, గంజాయి పంట వేయకుండానే గంజాయి పంట సాగు చేస్తున్న వేరే గ్రామానికి చెందిన ఫోటోలు,వీడియోలు ఆధారంగా తప్పుడు కేసు నమోదు చేయడం సరైన పద్ధతి కాదని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి ఆరోపించారు.
బాధిత కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఎక్కడైనా నోరు విప్పితే మీపై కూడా కేసు నమోదు చేస్తామని హుకుంపేట ఎస్సై,సిఐ ఆరోజు రాత్రి 9 గంటల వరకు హుకుంపేట పోలీసు స్టేషన్ లో నిర్బంధించారని ఆరోపించారు.ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆ గ్రామానికి వెళ్లి పరిశీలన చేయగా సెంట్రల్ జైలుకు తరలించిన బాధితులు గంజాయి పంట వేయలేదని తేలిందని అర్జున్ అన్నారు.ఇటువంటి తప్పుడు కేసులు నమోదు చేయడం ఆపాలని,హుకుంపేట ఎస్సై సతీష్,సిఐ సుధాకర్ లు మీ వైఖరి మార్చుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి తప్పుడు కేసులు నమోదు చేసినట్లు అయితే పెద్ద ఉద్యమం చేయాల్సి ఉంటుందని అర్జున్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.