Breaking News

ప్రజలకు మంచి జరగాలంటే మళ్ళీ జగనే సీఎం కావాలి -మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి

0 27

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయితీ లోని కోరుకొండ గ్రామంలో ‘జగనే ఎందుకు కావాలి ‘అనే కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచి జరగాలంటే,ప్రజలకు ఆర్థికాభివృద్ధి జరగాలంటే,ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే,ప్రజల ఆర్థిక పరిస్థితులు,స్థితిగతులు మారాలంటే మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలని అన్నారు.గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని,కనుక ప్రజలకు మంచి జరగాలంటే మళ్ళీ జగనే సీఎం కావాలని అన్నారు.ప్రజల ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్,ఎంపీటీసీ బాబురావు,వైస్ సర్పంచ్ కామరాజు చిట్టిబాబు,వార్డు మెంబెర్స్,కన్వీనర్ లు, గృహ సారథులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.