Breaking News

గ్రామ సచివాలయ వ్యవస్థతోనే పారదర్శక పాలన-పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.

0 15

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు: గ్రామ సచివాలయ వ్యవస్థతోనే ఆంధ్రప్రదేశ్ లోని పారదర్శక పాలన సాధ్యమైందని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అన్నారు.
సుండ్రుపుట్టు గ్రామంలో పాడేరు-3, చింతల వీధిలో గ్రామ సచివాలయాలను వాంతాడపల్లిలో ఆర్బీకే ను గురువారం భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రూపాయి అవినీతి లేకుండా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పారదర్శకమైన పాలన అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక సాయం అందిస్తూ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వం తమదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని ఒకే కుటుంబానికి మూడు నుంచి ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం అందించింది అన్నారు. ప్రతి ఒక్కరికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు వంతల సీతమ్మ,కొట్టగుల్లి ఉషారాణి,మాదేల రమణమ్మ,చింతలవీధి వైస్ సర్పంచ్ తామర్ల సురేష్,ఎంపీటీసీలు గిడ్డి విజయకుమారి,చల్లా చిట్టెమ్మ, మండల పార్టీ అధ్యక్షులు సీదరి రాంబాబు,ఎంపీపీ సొన్నారి రత్నకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుతంగి సూరిబాబు,ఏఎంసి డైరెక్టర్ గబ్బాడి రాజారావు,జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్న దొర,సర్పంచ్ గొల్లోరి నీలకంఠం,ఎంపీటీసీలు లకే రామకృష్ణ పాత్రుడు,ఎంపీటీసీ దూసూరు సన్యాసిరావు,పాస్టర్ బాబురావు,సచివాలయ కన్వీనర్లు వంతల నరేష్, లకే సత్యవతి,కొట్టగుళ్ళి నాగేంద్ర,సోషల్ మీడియా కన్వీనర్ అల్లాడ నాగేష్,వైఎస్ఆర్సిపి నాయకులు ప్రసాద్,సచివాలయ సిబ్బంది,గ్రామ వాలంటీర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.