Breaking News

సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే జగనన్న మల్లీ రావాలి..కావాలి-ఎంపీపీ

0 25

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:కొయ్యూరు మండలం బూదరాళ్ళ గ్రామ పంచాయితీ పరిధిలో జరిగిన ఏపీ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం వైయస్సార్ మండల నాయకులు ఎంపీపీ బడుగు రమేష్,మండల జేసిఎస్ కన్వీనర్‌ బండి సుధాకర్,గాడి సత్యనారాయణ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి సుమారు 75 సంవత్సరాల కాలంలో బూధరాళ్ళ పంచాయతీ ప్రజల కష్టాలు 75% తీరాయి అని అన్నారు. కారణం సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి.. ఒక్క అధికారి నెలకు ఒకసారి వచ్చే రోజులు నుండి
బూధరాళ్ళ పంచాయితీ ప్రజలకు 10మంది సిబ్బంది ప్రతీ రోజు అందుబాటులో ఉండటం ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు అని అన్నారు.దానికి తోడు 30మందికి పైగా వాలంటీర్లను ప్రజలకు సేవచేయడానికి ఉంచి వారి ద్వారా ప్రభుత్వ పథకాలు కావచ్చు, వారియొక్క ఇతర పత్రాలు కావచ్చు,ఎటువంటి రాజకీయాలు చేయకుండా,పార్టీలు చూడకుండా,ప్రతీ ఒక కుటుంబానికి వీలైనంత ఎక్కువ మంచి చేసేలా చూడటం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. అనంతరం వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరణ,పథకాలు లబ్ధి యొక్క డిస్ప్లే చేసి గృహసారధులకు కిట్లు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సంజీవ్,ఎంపీటీసీ,నారాయణ,కన్వీనర్లు తిరుపతి,సర్పంచ్ నత్తూరు సొమన్నదొర,వాలంటీర్లు,సచివాలయం సిబ్బంది,గృహసారధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.