Breaking News

చింతపల్లి:అన్నవరంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం.

0 22

ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీలో మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి, ఎంపీపీ అనూషా దేవి,జడ్పిటిసి పోతురాజు బాలయ్య ఆధ్వర్యంలో ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ పార్టీ జండా ఆవిష్కరణ, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలకు సంబంధించిన డిస్ప్లే బోర్డు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలే రానున్న రోజుల్లో వైసీపీ కి శ్రీరామరక్ష అని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని 2024లో మళ్లీ ముఖ్యమంత్రిని చేసి ఇప్పుడు అందుతున్నట్లుగానే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటట్లు మరింత అభివృద్ధి జరిగేటట్లు ప్రజలందరూ ఆశీర్వదించాలని మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సన్యాసి రావు, వైసీపీ నాయకులు మంజు మల్లేశ్వరరావు, మహేష్,రామన్న,చంటి,భగత్ రామ్, వార్డు మెంబర్లు జ్యోతి,జానకి, భీమన్న,కామేశ్వరరావు,లక్ష్మి,కన్వీనర్లు,గృహసారధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.