Breaking News

పాడేరు: ఏబీవీపీ ఆధ్వర్యంలో బిర్షా ముండా జయంతి వేడుకలు.

0 14

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు: ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాడేరు శాఖ ఆధ్వర్యంలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాత్రంత్ర సమరయోధులు గిరిజన నాయకులు భగవాన్ బిర్షా ముండా 149వ జయంతిని(జనజాతి గౌరవ దివస్ )నిర్వహించడం జరిగింది. ఏబీవీపీ గిరిజన విద్యార్థుల విభాగం రాష్ట్ర కన్వీనర్ అంగనైని ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా బిర్షా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ ఎం.ఎం.ఎల్. పాత్రుడు మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై బిర్షా ముండా సాయుధ పోరాటం చెయ్యడంతో గిరిజనులకు భూమి హక్కు వ్యవసాయ హక్కులను రావడానికి బిర్షా ముండా కృషి చేసారని గిరిజనుల కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు బిర్షా ముండా అన్నారు.

స్వాత్రంత్రo కోసం గిజనుల కోసం పోరాడిన సమర యోధులు బిర్ష ముండా, కొమరం భీమ్,గాం గంటందొర,మల్లుదొర,మర్రి కామయ్య వంటి వారి జీవిత చరిత్రలను పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వీరి ప్రాణత్యాగాలు కనుమరుగు కాకుండా పాఠ్యాంశాల్లో భద్రంగా ఉంటాయని, బిర్షా ముండా ను స్ఫూర్తిగా తీసుకొని గిరిజనుల హక్కులపైన సమస్యలపైన పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూజారి ఉపేంద్ర,వనవాసి ఆశ్రమం జిల్లా సంఘటన కార్యదర్శి రామకృష్ణ,నగర కార్యదర్శి గిర్లియ నాగార్జున, నగర హాస్టల్స్ కన్వీనర్ కిల్లో పరమేష్,చింతపల్లి భాగ్ కన్వీనర్ పాంగి మోహన్,అరకు భాగ్ కన్వీనర్ రామ్ కుమార్,చందు,పంతులు,సంతోష్,కాశీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.