Breaking News

రహదారి,విద్యుత్,నీటి సమస్య పరిష్కారానికై వైసీపీ నేతలు కృషి.

0 20

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం,నల్లగొండ పంచాయితీ లోని నల్లగొండ కొత్తవీధి,బోయవుట కొత్తవీధి గ్రామాలను ఎంపీపీ బడుగు రమేష్, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు సందర్శించారు.ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను వారు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలో నల్లగొండ కొత్తవీధి గ్రామంలో మూడు బోర్లు, వీధి కొళాయిలు ఉన్నప్పటికీ నీరు సరిపడినంతగా అందటంలేదని కనుక మరొక బోర్ వెల్ మంజూరు చేయాలని కోరారు.అలాగే బోయవుట కొత్తవీధి లో రహదారి, విద్యుత్ సుదుపాయం కల్పించాలని అక్కడ కోరారు.వెంటనే స్పందించిన ఎంపీపీ బడుగు రమేష్ రహదారి గురించి ఎన్ఆర్ఇజిఎస్ ఏపీఓ తో, విద్యుత్ గురించి ఎలక్ట్రికల్ ఏఈ తో, అలాగే వాటర్ గురించి ఆర్డబ్ల్యూఎస్ జేఈ తో అక్కడి నుండే మాట్లాడి సమస్యలు తెలియజేశారు.ఆ సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవాలని అన్నారు.తమ సమస్యలు చెప్పిన వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మండల వైసీపీ నాయకులు ఎంపీపీ బడుగు రమేష్, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు కి నల్లగొండ కొత్తవీధి,బోయవుట కొత్తవీధి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్గగొండ వైస్ సర్పంచ్ భవాని, వార్డు మెంబర్ లు దేవి,లక్ష్మి,రాజేశ్వరి, వైసీపీ కార్యకర్తలు కోనేపు అచ్యుత్,మర్రి శివ గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.