డీఎఫ్ఓ ఆదేశాల మేరకు ఈరోజు పెదవలస రేంజ్ పరిధిలోని అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయితీ లోని తోటలూరు గ్రామంలో అటవీ శాఖ సిబ్బంది అయిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సింహాద్రి ఆధ్వర్యంలో పర్యావరణం అలాగే జీవన విధానం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ సింహాద్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని, గ్రామాల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ ని నివారించాలని, ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించి నేల సంరక్షణ, నీటి నిర్వహణను మనమే కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.