Breaking News

రావణాపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా.

0 657

అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలంలోని రావణాపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపూడి వైపు నుంచి కేడీ పేట వైపుకు వెళుతున్న ఓ ఆటో రావణాపల్లి గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని,అందులో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. లొద్దిపాకలు గ్రామానికి చెందిన ఆటోగా గుర్తించారు.అయితే వెనుక వైపు నుండి వచ్చే వాహనాలు కనిపించేందుకని మిర్రర్ ని సరిచేసే క్రమంలో ఒక్కసారిగా ఎడమ వైపుగా వెళుతున్న ఆటో కుడివైపుకు తిరిగి బోల్తా పడింది.

Leave A Reply

Your email address will not be published.