Breaking News

హత్య కేసులో నిందితుడుని అరెస్ట్ చేసిన కొయ్యూరు పోలీసులు.

0 427

*హత్య కేసులో నిందితుడుని అరెస్ట్ చేసిన కొయ్యూరు పోలీసులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఈనెల 10వ తేదీన తన కుమార్తె అయిన లక్ష్మీని తన అల్లుడు కొర్రా సత్తిబాబు కొట్టి చంపినట్లు కొయ్యూరు పోలీస్ స్టేషన్ కు డౌనురు కు చెందిన కిల్లో సీత అనే మహిళ రిపోర్టు మేరకు కొయ్యూరు పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేసారు.ఈ విషయంపై దర్యాప్తు చేసిన కొయ్యూరు సీఐ అల్లు స్వామి నాయుడు తన సిబ్బందితో కలిసి నేర స్థలాన్ని సందర్శించి మృతురాలు దేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తము నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. సదరు మృతురాలు లక్ష్మీని హత్య చేసి పరారైన నిందితుడు అయిన కొర్రా సత్తిబాబు(28) S/o కృష్ణ, పాలమామిడి గ్రామం,మూలపేట పంచాయతీ,కొయ్యూరు మండలానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. ఈరోజు అతనిని అరెస్టు చేయడం జరిగిందని, నిందితున్ని రిమాండ్ నిమిత్తము కోర్టుకు పంపడమైనదని సీఐ స్వామినాయుడు, కొయ్యూరు ఎస్ ఎస్ రాజారావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.