వినికిడి,దృష్టి లోపం విద్యార్థులకు ట్యాబుల పంపిణీ.
Agnews24x7(నవంబర్ 10) అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: జిల్లాలో 6 నుండి 10 తరగతులు చదువుతున్న వినికిడి, దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ట్యాబుల పంపిణీని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. శుక్రవారం కొయ్యూరు మండలంలో జరిగిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో ట్యాబుల పంపిణీ ప్రారంభిస్తూ వినికిడి, దృష్టి లోపం గల విద్యార్థులకు ట్యాబులు చాలా ఉపయోగకరమని, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదివి విజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. సమగ్ర సర్వ శిక్ష పథకం కింద జిల్లాకు 62 ట్యాబులు సరఫరా అయ్యాయని, అర్హులైన విద్యార్థులకు వాటిని పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సహిత విద్య కోఆర్డినేటర్ కె.భాస్కర్ రావు,ఎంపిడిఓ లాలం సీతయ్య, ఎంపీపీ బడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post