Breaking News

నిలకడ లేని మీ జనసేన పార్టీ వాళ్లకి నీతులు ఎవరూ చెప్పలేరు,చెప్పరు-వైసిపీ పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి

0 20

(అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం):”ఎవరి దగ్గర నీతులు చెప్పించుకునే పరిస్థితిలో జనసేన పార్టీ లేదు” అని జనసేన పార్టీ నేతలు ఇచ్చిన స్టేట్మెంట్ కి వైసీపీ పార్టీ కి చెందిన చింతపల్లి మండల అధ్యక్షుడు మోరి రవి స్పందించారు.మీరు చెప్పింది వాస్తవమేనని మోరి రవి అన్నారు.ఎందుకంటే పేరుకే జనసేన అని పేరు పెట్టారు కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రం ‘పవన్ కళ్యాణ్ ‘కాదు.మీ నాయకుడు ముఖ్యమంత్రి గా పోటీ చేయనప్పుడు,అతను ముఖ్యమంత్రి కాకపోతే ప్రజలకు జనసేన పార్టీ తరపున ఏవిధంగా మంచి చేస్తారని మోరి రవి ప్రశ్నించారు? పోనీ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు అవుతారు గానీ పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి గా అవకాశం ఇవ్వరు,ఉండదు మరి ఏ విధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయి ప్రజలను ఎలా ఉద్ధరిస్తారో చెప్పాలని అన్నారు.2014 లో ఇలాగే మీ అధినాయకుడు పవన్.. చంద్రబాబు దగ్గరకు వెళ్ళి చతికిలపడిన సంగతి మీకు గుర్తు లేదా లేక మరచిపోయారా అని అన్నారు.కనుక మీ జనసేన పార్టీ గురించి ఎవరూ నీతులు చెప్పే పరిస్థితిలో లేరు.మీ పార్టీ గురించి మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు తప్ప.నిలకడ లేని మీ జనసేన పార్టీ గురించి మాట్లాడటానికి నాకే సిగ్గుగా ఉందని ఎద్దేవా చేశారు.ఇన్ని సొల్లు కబుర్లు చెప్పే జనసేన పార్టీ నేతలకు ఒక్కటే ప్రశ్న.. మీకు 175 స్థానాల్లో మీ పార్టీ తరపున పోటీ చేసే దమ్ముందా?175 స్థానాల వరకు ఎందుకు పాడేరు నియోజకవర్గానికి జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ తెచ్చుకొనే దమ్ముందా? మీలాంటి పిల్ల బచ్చా గాళ్ళు హెచ్చరిస్తున్నాం అని స్టేట్మెంట్ ఇస్తే వణికపోయేవాడు ఎవడూ లేడని పెళ్ళిళ్ళ, ఫంక్షన్ ల నాయకుడు మిమ్మల్ని ఉసిగొల్పి సమాధానం చెప్పలేక సైలెంట్ గా బాగానే తప్పుకున్నాడని రవి వెటకారంగా సమాధానం చెప్పారు.మీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరి గంగులయ్య గిరిజన ప్రజలను చైతన్యవంతులుగా తయారు చేయలన్నా, మీకు ఆదరణ పెరగాలన్నా ప్రజల్లోకి వెళ్ళాలి కానీ, పెళ్ళిళ్ళ కు, ఫంక్షన్లకు వెళ్లి ఫోటోలు దిగితే అది జరగదని, ఇలాంటి రాజకీయాలు చేస్తూ సీరియస్ గా కామెడీ చేయోద్దని మోరి రవి సూచించారు.మా పార్టీ కులం, మతం,ప్రాంతం అని తేడా లేకుండా మీ జనసేన పార్టీ వాళ్ళకు కూడా అర్హులైతే చాలు సంక్షేమ పథకాలు బాగానే ఇస్తుందని, మీరు కూడా అర్హులైతే మేము ఇచ్చే పథకాలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని జవాబిచ్చారు.నిలకడ లేని పార్టీ కి మేము జనసేన పార్టీ అని చెప్పుకోవడం మాని,పక్కకెల్లి క్రికెట్టో,వాలీబాలో ఆడుకోవాలని మోరి రవి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.