Breaking News

కొయ్యూరు: రేపు గాము గంటందొర శత వర్ధంతి కార్యక్రమానికి విచ్చేయనున్న పాడేరు ఎమ్మెల్యే.

0 19

కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి (పాడేరు ఎమ్మెల్యే)

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయితీ లోని లంకవీధిలో ఈనెల 7వ తేదీన స్వాతంత్ర్య సమర యోధుడు గాము గంటందొర శత వర్ధంతి కార్యక్రమానికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి హాజరుకానున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమానికి రేపు ఉదయం 10 గంటలకు ట్రైకార్ చైర్మన్, ఎస్టీ సెల్ చైర్మన్, కొయ్యూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఎంపీపీ, జడ్పిటిసి, నామినేటెడ్ పదవులలో ఉన్న వివిధ శాఖల చైర్మన్లు, డైరెక్టర్లు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.