Breaking News

తోటలూరులో త్రాగునీటి సమస్య.మూడు రోజులుగా ఇక్కట్లు.

సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్న గ్రామస్తులు.

0 115

Agnews24x7 (నవంబర్-9): అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని తోటలూరు గ్రామంలో మూడు రోజుల నుంచి నెలకొన్న తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజుల క్రితం గ్రామంలో ఉన్న తాగునీటి పథకానికి సంబంధించిన విద్యుత్ మోటారు మరమ్మతులకు గురైందని గ్రామస్తులు తెలిపారు. దీంతో తాగునీటి సరఫరా నిలిచిపోయి,తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.గ్రామంలో ఉన్నవి రెండు బోర్లు మాత్రమేనని గ్రామంలో ఇల్లులు అన్ని ఒకవైపు.. రెండు బోర్లు మెయిన్ రోడ్ వైపు ఉండడంతో విద్యుత్ మోటార్ పాడై కుళాయిలకు వాటర్ రాకపోవడంతో మూడు రోజులుగా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. కనుక సంబంధిత అధికారులు వెంటనే విద్యుత్ మోటారు బాగు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.