Breaking News

సిసి రోడ్ల పనులను ప్రారంభించిన జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గొడ్డేటి మహేష్ బాబు.

0 47

Agnews24x7(నవంబర్-9): సిసి రోడ్ల పనులను ప్రారంభించిన జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గొడ్డేటి మహేష్ బాబు.

ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం,వెలగలపాలెం గ్రామ పంచాయతీ,రావిమానుపాలెం గ్రామంలో నూతనంగా మంజూరైన సీసీ రోడ్ల పనులను స్థానిక సర్పంచ్ ఇరవాడ రత్నకుమారి తో కలిసి ఏ.ఎస్.ఆర్ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గొడ్డేటి మహేష్ బాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ..అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఆధ్వర్యంలో సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత బట్టి సిసి రోడ్లు,డ్రైనేజీ,మంచినీటి బోర్లు,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సుర్ల గంగాపవన్,సత్తిబాబు,వెంకటరమణ,పంతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.