Breaking News

రహదారి,సెల్ టవర్ పనులకు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించిన వైసీపీ నాయకులు.

0 19

 రహదారి,సెల్ టవర్ పనులకు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించిన ఎంపీపీ, జడ్పీటీసీ, ఏఎంసీ చైర్ పర్సన్.

గత నెల 28వ తేదీన కొయ్యూరు విచ్చేసిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ని అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయతీ కి చెందిన బోయవుట కొత్తవీధి గ్రామస్తులు కలిసి తమ గ్రామానికి రహదారి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. బోయవుట కొత్తవీధి గ్రామం యొక్క పరిస్థితులు అక్కడ ఉన్న సమస్యలు పరిశీలించి గ్రామస్తులను అడిగి తెలుసుకుని రమ్మని కొయ్యూరు మండల వైసిపి పార్టీ నేతలకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఎంపీపీ బడుగు రమేష్,ఏఎంసి చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ నెలకొన్న సమస్యలు ఎమ్మెల్యేకి తెలియజేసి సంబంధిత అధికారులకు ఎంపీపీ ఫోన్ ద్వారా సమాచారం అందించి సమస్యలు త్వర త్వరగా పరిష్కరించాలని మాట్లాడారు. దీంతో స్పందించిన ఏపీవో ఎన్ఆర్ఈజీఎస్ పనుల ద్వారా నల్లగొండ నుండి బోయవుట కొత్తవీధి వరకు రహదారి నిర్మించేందుకు చొరవ తీసుకున్నారు. ఈరోజే ఆ రహదారి నిర్మాణానికి కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పిటిసి వారా నూకరాజు, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యుత్ సౌకర్యం కూడా నెల రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన పది రోజులలో రహదారి నిర్మాణానికి కృషిచేసిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కి, కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ కి, చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మకి, మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు కి, జడ్పిటిసి వారా నూకరాజుకి బోయవుట కొత్త వీధి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నల్లగొండ గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ పనులను ఎంపీపీ,జడ్పిటిసి,ఏఎంసి చైర్పర్సన్ ప్రారంభించారు. అనంతరం నల్లగొండ కొత్త వీధి గ్రామానికి సంబంధించి మూడు బోర్లు, వీధి కొళాయిలు ఉన్నప్పటికీ సరిపడా నీరు అందటం లేదని గ్రామస్తులు చెప్పడంతో మరల ఆ గ్రామానికి వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడగా ఇంతకు ముందు ప్రభుత్వం వారు ఒక బోర్ వెల్ కొట్టించడం జరిగిందని, ఆ బోర్వెల్ వద్ద మోటార్ ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు తెలియజేశారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని ఎంపీపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కమలమ్మ,వైస్ సర్పంచ్ భవాని, వార్డు మెంబర్ లు దేవి,లక్ష్మి,రాజేశ్వరి టెక్నికల్ అసిస్టెంట్ రాజు,వీఆర్పీలు దేవుడు రాజు, గంగరాజు, సచివాలయ కన్వీనర్ నాగేంద్ర, గృహ సారధి నాగమణి, వైసీపీ నేతలు కోనేపు అచ్యుత్,ఎం.శివ, వాలంటీర్లు, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.