ఆరోగ్యం కుదుటపడిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంటా-ఏపి ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు.
గత వారంలో అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.వారం రోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు.అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేక నాయకులను,కార్యకర్తలను కలవలేకపోతున్నట్లు తెలిపారు.కలిగిన అసౌకర్యానికి ఎంతగానో చింతిస్తున్నట్లు తెలిపారు.ఆరోగ్యం కుదుటపడి కోలుకున్న వెంటనే అందరికీ అందుబాటులోకి వస్తానని మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటానని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా నాయకులకు కార్యకర్తలకు తెలిపారు.