Breaking News

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్.

ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపిన ఏఎంసీ చైర్పర్సన్.

0 27

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని రావణాపల్లి పంచాయితీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జైతి రాజులమ్మ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ పంచాయతీలలో ఎక్కడైతే మీకు సీసీ రోడ్లు అవసరమో …అవసరమైన ప్రతీ చోటా సీసీ రోడ్లు వేయించాలని ఒక సందర్భంలో ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి మాట్లాడటం జరిగిందని, అన్నట్టు గానే చాలా పంచాయితీలలో సీసీ రోడ్లు మంజూరు చేసి వాటి నిర్మాణ పనులు కూడా త్వరత్వరగా చేయడం జరుగుతుందని కనుక పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి చింతపల్లి ఏఎంసీ చైర్పర్సన్ జైతి రాజులమ్మ ధన్యవాదాలు తెలిపారు.ఏఎంసీ చైర్ పర్సన్ తో పాటు వైఎస్ఆర్సిపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్ పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.