రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి కి ఘోర అవమానం జరిగింది.గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాం గంటందొర శత వర్ధంతి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బట్టపనుకుల పంచాయితీ లోని లంకవీధిలో ఘనంగా నిర్వహించారు.కానీ ఈ కార్యక్రమంలో ఒక రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ ని మాత్రం ప్రోటోకాల్ మరిచిన అధికారులు ఆమెను వెనుక వరుసలో కూర్చోబెట్టి ఘోరంగా అవమానించినట్లే ఉంది.ఒక గిరిజన తెగకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు గాం గంటందొర కార్యక్రమంలో రాష్ట్ర బీసీ డైరెక్టర్ కి దక్కిన గౌరవం,రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ గా ఉన్న గిరిజన మహిళకు ఆ గౌరవం దక్కలేదు అనడానికి స్టేజ్ పై వెనుక వరుసలో కూర్చొని ఉన్న ఆమె ఫోటో నే ఆధారం.కొయ్యూరు మండలం అనేసరికి పూర్తిగా ఏజెన్సీ గిరిజన ప్రాంతం అయినప్పటికీ,రాజకీయంగా గిరిజనులు ఎదగడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉండదు,గిరిజనేతరులు రానివ్వరు అనేది మండలంలో అందరికీ తెలిసిన సత్యం.ఈమె విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుందా? అనేది ప్రశ్న?
సుమర్ల సరస్వతి ఈమధ్య రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ గా పదవిని స్వీకరించారు కానీ..2014 లోనే ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా పాడేరు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు తన గవర్నమెంట్ ఉద్యోగం కూడా వదిలి బయటకు వచ్చారు.అయినా అప్పుడు ఈమెకు అదృష్టం వరించలేదనే చెప్పాలి.అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈమెకు రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ గా నియమించినా.. ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు సముచిత స్థానం కల్పించడం లేదనే చెప్పాలి.గవర్నమెంట్ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ మరి అధికారులకు ప్రోటోకాల్ గురించి తెలిసి చేస్తున్నారా?లేక తెలీక చేసారా అనే విషయం మాత్రం తెలియడం లేదు.ఏది ఏమైనప్పటికీ ముందుముందు జరగబోయే కార్యక్రమాలకైనా రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ గా ఉన్న సుమర్ల సరస్వతి విషయంలో ప్రోటోకాల్ పాటిస్తారా?లేదో చూడాలి.అయితే ఈ విషయమై సుమర్ల సరస్వతి వద్ద ప్రస్తావించగా పూర్తిగా పిలవకపోయినా పరువాలేదు గాని..పిలిచి ఇలా అవమానించడం బాగోలేదని ఆమె సమాధానం ఇచ్చారు.