సామాజిక బస్సు యాత్రను విజయవంతం చేద్దాం: చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఈనెల 30న పాడేరు లో జరగనున్న సామాజిక బస్సు యాత్రను విజయవంతం చేయాలని చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ ప్రజలను కోరారు.ఈ క్రమంలో ఆమె ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు.రానున్న రోజుల్లో మళ్ళీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పూర్తి మద్దతు పాడేరు నియోజకవర్గం నుండి ఇస్తున్నట్లు ఈ బస్సు యాత్ర ద్వారా తెలియజేయాలని ఆమె తెలిపారు.ప్రజలకు మంచి జరగాలంటే మళ్ళీ వైయస్సార్ సీపీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందుకు మన పూర్తి మద్దతు తెలపాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ సర్పంచ్ జగధీశ్వరి, వార్డు మెంబర్ దేవి గ్రామస్తులు పాల్గొన్నారు.