Breaking News

పాడేరు సామాజిక బస్సు యాత్ర ను విజయవంతం చేయండి.

0 114

*పాడేరు సామాజిక బస్సు యాత్ర ను విజయవంతం చేయండి.

*కొలుసు మోహన్ యాదవ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి.

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: 30న పాడేరులో జరగబోయే సామాజిక బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లుకై కేంద్ర పార్టీ నియమించిన మండల సమన్వయ ఇన్చార్జ్ అయిన కొలుసు మోహన్ యాదవ్ స్థానిక మండల నాయకులతో సమావేశం అయ్యారు.పాడేరులో జరిగే సామాజిక బస్సు యాత్రకు ప్రతి ఒక్కరు జన సమీకరణ చేయడానికి ప్రతీ నాయకులు కార్యకర్తలు నడుంబిగించి బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతీ వ్యక్తిని భాగస్వామ్యం చేయాలని తద్వారా ఈ యాత్ర యొక్క ఉద్దేశం వారికి తెలుస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో
ఎంపీపీ బడుగు రమేష్,జడ్పీటీసీ వారా నూకరాజు,మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు,వైస్ ఎంపీపీ నూకాలమ్మ,జేసీఎస్ కన్వీనర్‌ బండి సుధాకర్,బిసి డైరెక్టర్ గాడి నాగమణి,నాయకులు గాడి సత్యనారాయణ ఎంపీటీసీ అప్పారావు,శేఖర్,తిరుపతి,వనంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.