ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి పంచాయితీ లోని నూతిబంధ గ్రామంలో అల్లూరి యువ గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లూరి యువ గిరిజన సేవా సంఘం అధ్యక్షులు టి మల్లేష్ మాట్లాడుతూ.. వచ్చే వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా మలేరియా ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కాచి వడబోసిన నీళ్లు మాత్రమే తాగాలని, పరిసరాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం అనంతరం పదవ తరగతి,ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానించడం జరిగింది.యువతకు క్రీడల్లో ప్రోత్సహించడం కోసం వాలీబాల్ కిట్ కూడా బహుకరించడం జరిగింది.. కోటి మాస్టర్ ఆధ్వర్యంలో ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచిన చిన్నారుల కు సర్టిఫికెట్ లు అందజేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పి.సన్యాసిరావు,అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కోటిబాబు,సేవా సంఘం ప్రతినిధులు బి.సింహాచలం, లోవరాజు అలాగే గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Related Posts