Breaking News

కొయ్యూరు: వర్ణుడి కోసం జలాభిషేకం.

0 118

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరులో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వర్ణుడు కోసం జలాభిషేకం చేయడం జరిగింది. ఆలయ ధర్మకర్త మాజీ జీసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ ఆధ్వర్యంలో కొయ్యూరు,రాజేంద్రపాలెం,చీడిపాలెం పంచాయితీల రైతులు.. గత 20 రోజులుగా వర్షం లేక పొలాలు ఎండిపోతుంటే వర్షం కోసం శ్రీ మల్లికార్జున స్వామికి నూట ఒక్క మెట్టు కింద పాతాళ గంగ ని రైతులు గర్భగుడిలో ఉన్న ఈశ్వరుని పూర్తిగా నీటిలో మునిగే వరకు జలాభిషేకం చేయడం జరిగింది. సుమారుగా వెయ్యి బిందెలు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు వైస్ ఎంపీపీ నూకాలమ్మ, మేడిపోయిన చిన్న,కొయ్యూరు సర్పంచ్ బాలరాజు,వాసం రాంబాబు, మువ్వల రాజు,దిబ్బరత్నం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.