Breaking News

పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్.

0 516

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: మండలంలోని భీమవరం గ్రామ శివారులలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎస్సై రాజారావు, మంప ఎస్సై లోకేష్ కుమార్ తెలిపారు. ముందస్తు సమాచారంతో, తమ సిబ్బందితో కలిసి మంగళవారం భీమవరం గ్రామ శివారులలో పేకాట శిబిరంపై దాడులు నిర్వహించగా, గొలుగొండ మండలం కేడీ పేట గ్రామానికి చెందిన దిగుముర్తి ప్రసాద్, పాత కేడీ పేటకు చెందిన బొబ్బది వర్మ, అలాగే పరవాడ మండలం లంకెలపాలెం గ్రామానికి చెందిన పొంతపల్లి బాలరాజు అనే ముగ్గురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారని చెప్పారు. ఈమేరకు వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.12,360 నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎవరైనా పేకాట, కోడిపందాలు తదితర జూదాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సైలు హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.