Breaking News

ఓటు కార్డుకు ఆయుధ పూజ.

0 157


చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఓటు కు ఆయుధ పూజ. దసరా పండుగ పరువదినాన శత్రు సంహారాణికి ప్రతీకగా చేసే ఆయుధ పూజలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయితీ,గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఎఱ్ఱ గొండమ్మ తల్లి ఆలయం వద్ద ఎస్ టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ ఓటు కార్డ్ కు ఆయుధ పూజ చేయించారు. జంపా వెంకటరమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యంలో ఓటు ను మించిన ఆయుధం మరొకటి లేదు అని సైకో పాలన అంతం దిశగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఓటుకు పూజ చేయించినట్టు తెలిపారు. ఈ కార్య్రమంలో శరభన్నపాలెం మాజీ సర్పంచ్ దారకొండ నారాయణ మూర్తి,లోచెల శ్రీను,మాజీ మెంబర్ దుచ్చరి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.