గత కొంతకాలంగా అపెండిసైటిస్ నొప్పితో బాధపడుతున్న నల్లగొండ సర్పంచ్ జంపా రాజకుమారి ఓమిని ఆర్ కె హాస్పిటల్ లో చికిస్త పొందుతున్నారు. ఈ విషయం తెలుకున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఆదేశాల మేరకు ఆమె భర్త నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ అక్కడికి వెళ్లి ఆమెను పరామర్శించారు. హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించాలని శివ ప్రసాద్ వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.