Breaking News

అన్నదాన కార్యక్రమానికి 20 వేల రూపాయలు విరాళం అందించిన అరకు ఎంపీ.

0 37

అన్నదాన కార్యక్రమానికి 20 వేల రూపాయలు విరాళం అందించిన అరకు ఎంపీ గోడ్డేటి మాధవి.

అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలం,పెదమాకవరం గ్రామ పరిధిలో ఉన్న రామాలయంలో త్వరలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవ్వాలని ఈరోజు గ్రామస్తులు స్థానిక నాయకులతో కలసి అరకు ఎంపీ గోడ్డేటి మాధవి శివప్రసాద్ దంపతులకు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందించి అన్నదాన కార్యక్రమానికి తమ వంతుగా 20 వేల రూపాయలు విరాళం అందజేయడం జరిగింది.
అనంతరం ఎంపీ దంపతులకు గ్రామ ప్రజలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్, సూరిబాబు,నూకరాజు,వెంకటేష్,రమణ,బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.