Breaking News

బైక్ యాక్షిడెంట్ లో మరణించిన రమణబాబు కుటుంబానికి చేయూత వారియర్స్ టీమ్ నిత్యావసర సరుకులు పంపిణీ.

0 244

ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చిట్టెంపాడు పంచాయతీ లోని గోపవరం గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు అలాగే చేయూత వారియర్స్ ట్రస్ట్ (చింతపల్లి) సభ్యులు సందర్శించారు. గోపవరం గ్రామానికి చెందిన సెగ్గే రమణబాబు ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో మరణించడంతో భార్య,ముగ్గురు పిల్లలు దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారని హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు టి.మల్లేష్ ద్వారా తెలుసుకొని
ఈరోజు చేయూత వారియర్స్ ట్రస్ట్ (చింతపల్లి )చైర్మన్ దూనబోయిన రమణ అలాగే సభ్యులు గోపవరం గ్రామానికి వెళ్ళి రమణబాబు కుటుంబానికి దైర్యం కల్పించి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు నూనె డబ్బా,బియ్యం ఇద్దరు పిల్లలకు బట్టలు, కూరగాయలు అందించారు.

ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ… చేయూత వారియర్స్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న రమణ కు టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి ఏజెన్సీలో అనేక ప్రాంతాల్లో మీసేవలు కొనసాగాలని ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో చేయూత వారియర్స్ టీమ్ సభ్యులు ఈరెల్లి రాజేష్, ఇండుగ శేఖర్,ఇమ్మంది మొదగిరి,కిముడు బిలస్కర్,రమేష్,నానాజీ, లోవరాజు గ్రామపెద్దలు పెట్ల గాంధీ,బొజ్జన్న దొర,సెగ్గే జగ్గారావు,పొల్లు దొర,పాడి చిన్న పోతురాజు,రమణబాబు కొండబాబు,రాంబాబు,శేషు యువత పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.