Breaking News

నూతన వధూవరులను ఆశీర్వదించిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

0 15

అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలం,డౌనూరు పంచాయితీ,ధర్మవరం గ్రామంలో అకుసింగి వీరబాబు (టీచర్), నూకరత్నం దంపతుల కుమారుడి వివాహం సందర్భంగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి..స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ ధర్మవరం గ్రామంలో అకుసింగి వీరబాబు స్వగృహం నందు రాత్రి 12.50 నిమిషాలకు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి,ఆశీర్వదించి,అభినందనలు తెలియజేశారు.

ఈ వేడుకలో ఎంపీ వెంట డౌనూరు ఎంపీటీసి బిడిజన అప్పారావు,మాజీ సర్పంచ్ నీలాపు సూరిబాబు,వైఎస్ఆర్సిపి బూత్ కమిటీ మండల కన్వీనర్ పోతురాజు,సీనియర్ నాయకులు రామ్మూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.