Breaking News

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి శివప్రసాద్ దంపతుల ఔదార్యం.

0 118

•అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి 5000వేలు రూపాయలు ఆర్థిక సాయం.
•అరకు ఎంపీ గొడ్డేటి మాధవి శివప్రసాద్ దంపతులు ఔదార్యం.

ఈరోజు పాడేరు నియోజకవర్గం,కొయ్యూరు మండలం,బాలారం గ్రామ పంచాయతీ పరిధిలో నిరుపేద కుటుంబానికి చెందిన నాగులపల్లి కొండబాబు కుమార్తె చిన్నారి స్వీటీ (6 నెలలు) అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుందని,వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందని స్థానిక నాయకుల ద్వారా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపి స్పందించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలని వారి భర్త అయిన నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ కి తెలిపిన వెంటనే వారు చిన్నారి తండ్రికి విశాఖపట్నంలో ఎంపి పార్టీ కార్యాలయంలో ఖర్చులు నిమిత్తం నగదును అందజేసి చిన్నారి త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.