Breaking News

రోగాలు అరికట్టడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం – ఎంపీపీ బడుగు రమేష్

0 59

కొనసాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం.

రోగాల శాతం అరికట్టడమే ఆరోగ్య సురక్ష లక్ష్యం.

– కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఆరోగ్యకరమైన జీవితం ప్రతీ మనిషికి అవసరమని, ఎంత ఉన్నా మనిషి ఆరోగ్యంగా లేకపోతే,కుటుంబం పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉంటుంది అని,కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రం మొత్తం జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేసి, డాక్టర్లను ప్రతీ గ్రామానికి పంపి,ప్రజలకు అవసరమైన చికిత్స అందించడమే కాకుండా వారికి ఉన్న వ్యాధులను ముందుగా గుర్తించి, మెరుగైన చికిత్స కోసం పలు సలహాలు, సూచనలు ఆరోగ్య శ్రీ ద్వారా పొందేందుకు సంసిద్ధత చేస్తున్నారని ఎంపీపీ అన్నారు . వ్యాధి యొక్క లక్షణాలు ముందుగా గుర్తించడంవలన,90%వ్యాధిని అంతం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అని ప్రభుత్వం భావించి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణంగా ప్రజలు భావిస్తున్నారు అని ఎంపీపీ అన్నారు.
ప్రజల వద్దకు వైద్య బృందం రావడం వలన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నటువంటి వారు కూడా వైద్యుల వద్దకు వచ్చి వైద్యం పొందుతున్నారు అని అన్నారు.
గంగిగోవుపాలు గరిటడైనా చాలు కడివెడైననేమి ఖరముపాలు
అనే సామెత ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది గుర్తుకు వస్తారు అని..14సవత్సరాలు పాలించినా చేయలేని పనులు
జగనన్న కేవలం నేటికి 56 నె లల పరిపాలనలో అందులో 24 నెలలు కరోనా కారణంగా పోగా ..మిగిలిన 36 నెలల్లో అంటే ఇంత తక్కువ సమయంలో జగనన్న ప్రజలకు చేస్తున్న మంచి ప్రజలకోసం పరితపిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలని ఒక లక్ష్యంతో జగనన్న గంగిగోవుపాలులా పరిపాలన అందిస్తున్నారు అని ఎంపీపీ అన్నారు. ప్రజలు ఆరోగ్య సురక్ష కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లాలం సీతయ్య, మండలం పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు,స్థానిక సర్పంచ్ కిముడు సత్య నారాయణ, ఎంపీటీసీ లోకుల సోమాగాంధీ, మండల జేసీఎస్ కన్వీనర్‌ సుధాకర్,నాయకులు గాడి సత్యనారాయణ,కాళ్ళ వనంబాబు, శరభన్నపాలెం వైస్ సర్పంచ్
వైద్య సిబ్బంది, రెవెన్యూ డిటి,నాయుడు, సచివాలయం సిబ్బంది గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.