స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో వరుసగా సాలిడ్ కమర్షియల్ సక్సెస్ లను దక్కించుకోలేక పోయింది. అయినా కూడా సోషల్ మీడియా ద్వారా ఈమె షేర్ చేస్తున్న అందాల ఆరబోత ఫోటో షూట్స్ వరుసగా ఈ అమ్మడి యొక్క క్రేజ్ ను పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు.సౌత్ లో ఈమె సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతాని కి హిందీ సినిమాలు మరియు సిరీస్ లతో బిజీ గా ఉంది. ఇటీవల ఓటీటీ సినిమా లతో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని దక్కించుకోలేక పోయాయి.
తాజాగా ఈమె ఒక కార్యక్రమానికి హాజరు అయిన సందర్భంగా సిండ్రెల్లా డ్రెస్ లో సందడి చేసింది. పింక్ లాంగ్ గౌన్ లో రకుల్ యొక్క ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు వెళ్తున్న సమయంలో రకుల్ డ్రెస్ ను సహాయకుడు పైకి పట్టుకోవాల్సి వచ్చింది.
సోషల్ మీడియా లో ఆ విషయమై కూడా మీమ్స్ వస్తున్నాయి. రకుల్ డ్రెస్ అలా ఎత్తి పట్టుకోవడం ఎబ్బెట్టుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సెలబ్రెటీలు అన్నప్పుడు ఇలాంటివి తప్పదు అంటూ నెటిజన్స్ కామెంట్స్. రకుల్ తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వాల ని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు