అల్లూరి యువ గిరిజన సేవా సంఘం అలాగే హెల్పింగ్ హ్యండ్స్ ఆధ్వర్యంలో ప్రతినెల రెండవ శనివారం జరిగే విద్యా ప్రాముఖ్యత- అన్నదాన కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కిటుముల పంచాయతీ మారుమూల గిరిజన ప్రాంత గ్రామమైన లక్కవరం లో శనివారం విద్యా ప్రాముఖ్యత- అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్య యొక్క ప్రాముఖ్యత కోసం హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు టి మల్లేష్,వార్డెన్ జి.తిరుపతి బాబు విద్యార్థులకు,తల్లిదండ్రులకు అవగాహన పరిచారు. అనంతరం గ్రామంలో ఉన్న 70 మంది విద్యార్థులకు విద్యా సామాగ్రిని జి.తిరుపతిబాబు తన సొంత నిధులతో అందజేశారు. గ్రామంలో ఉన్న గ్రామస్తులు అందరికీ అన్నదానం చేయడం జరిగింది.. అల్లూరి యువ గిరిజన సేవ సంఘం అధ్యక్షులు & హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు టి.మల్లేష్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత చదువులు చదవాలని గిరిజన విద్యార్థులకు తల్లిదండ్రులకు హెల్పింగ్ హాండ్స్ ద్వారా ప్రతి నెల రెండవ శనివారం ఏదో ఒక గిరిజన గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామానికి వెళ్లి అవగాహనపరిచి అనంతరం ఆ గ్రామంలో ఉన్న పేద గిరిజనులకు అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుందనీ అన్నారు. మంచి కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు అలాగే అల్లూరి యువ గిరిజన సేవ సంఘం సభ్యులు మంచి మనసున్న దాతలు వల్ల ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక పులిగొంది ఉపాధ్యాయులు సంజీవ్,హెల్పింగ్ హాండ్స్ సభ్యులు జి.తిరుపతిబాబు,పి.చిట్టయ్య,కే.హరిదేవ్,పి.లక్ష్మణరావు,ఎన్. చెల్లయ్య,సత్యనారాయణ,ఉల్లి లక్ష్మయ్య,సన్నీ,బి.సింహాచలం,జాన్,పి. రామరాజు,రామచంద్ర మాస్టర్,కూడా సత్తిబాబు,పోతురాజు,దావీదు, రంజిత్,వెంకట్ గ్రామ పెద్దలు,మహిళలు,విద్యార్థులు పాల్గొన్నారు.
Prev Post