Breaking News

మీరు డ్వాక్రా మహిళలా?లేక టీడీపీ కార్యకర్తలా?

0 277

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ పై నల్లగొండ గ్రామానికి చెందిన కొందరు డ్వాక్రా మహిళలు పత్రికా ప్రకటన ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్ కి అదే గ్రామంలో ఉన్న మరి కొంతమంది డ్వాక్రా సంఘాల మహిళలు ప్రతి స్పందించారు. ఏఎంసీ చైర్మన్ రాజులమ్మ పై చర్యలేవి? అని ఇచ్చిన స్టేట్ మెంట్ ని వారు ఖండించారు.మీరు డ్వాక్రా మహిళలు అనే ముసుగులో ఇలా మాట్లాడుతున్న టీడీపీ కార్యకర్తలు కాదా అని ప్రశ్నించారు. ఇదే విషయమై జరిగిన ఎంక్వైరీలో డ్వాక్రా సంఘాల మహిళలు ఎక్కువ శాతం మంది డీలర్ గా రాజులమ్మ ఉండాలని మద్దతు తెలపడం మీకు గుర్తులేదా లేక మర్చిపోయారా అని అన్నారు. అధికారపార్టీని అడ్డంపెట్టుకోవాల్సిన అవసరం ఆమెకు లేదని, టీడీపీ కార్యకర్తలు అని డైరెక్ట్ గా చెప్పుకోలేక డ్వాక్రా మహిళలు అని చెప్పుకుంటూ స్టేట్ మెంట్ ఇస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న నల్లగొండ గ్రామాన్ని ఇలా అనేక రకాలుగా గొడవలు పెడుతూ వీధిలోకి లాగుతున్నారనీ అన్నారు. ఎవరో కొంతమంది పనికిమాలిన వాళ్ళు మిమ్మల్ని ఉసిగొల్పి ఇలా స్టేట్ మెంట్ ఇవ్వమంటే..ఊరి పరువు తీసుకుంటూ వెళ్ళడానికి మీకైనా సిగ్గుగా లేదా అని మండిపడ్డారు.లేనిపోని గొడవలు సృష్టిస్తూ గ్రామం పరువు ఇంకా దిగజార్చొద్దని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.