అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని కొప్పుకొండ,మంగళపాలెం గ్రామాల మధ్యలో ఉన్న కొండవాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం,ఇటీవలే మండలంలోని ప్రజాప్రతినిధులు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే! అయితే ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి రెండు గ్రామాల మధ్య భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం కొయ్యూరు ఎస్సై రాజారావు ఆయా గ్రామాల్లో పర్యటించారు.
గ్రామస్తులతో సమావేశమయ్యారు.గొడవలు,కోట్లాటలకు పాల్పవద్దని హితవు పలికారు.ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.అలాగే భూ వివాదాలు,సమస్యలుంటే రెవెన్యూ అధికారుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.