అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నియోజకవర్గ అభివృద్ధి నిధులతో బస్ షెల్టర్ శంకుస్థాపన చేసిన ఆడాకుల గ్రామ పంచాయతీ సర్పంచ్ అప్పారావు.
ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం,కొయ్యూరు మండలం,ఆడాకుల గ్రామ పంచాయతీ పరిధిలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నియోజకవర్గం అభివృద్ధి నిధులు 5 లక్షల రూపాయలతో నిర్మాణం కానున్న బస్ షెల్టర్ ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆడాకుల గ్రామ పంచాయతీ సర్పంచ్ అప్పారావు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్,వైస్ సర్పంచ్ రాంబాబు,రమణ,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.