Breaking News

5 లక్షల రూపాయలతో కూడిన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.

0 125

కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.

5 లక్షల నిధులు మంజూరు చేసిన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.

అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలం,నడింపాలెం గ్రామపంచాయతీలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుండి రూ.5 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ…గ్రామస్తులు,ప్రజల బహిరంగ ప్రజా ప్రయోజనాల కొరకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి కి పంచాయతీ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శరభన్నపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ కిముడు సత్యనారాయణ,ఎంపీటీసీ లోకుల సోమాగాంధీ,బట్ట పనుకుల గ్రామపంచాయతీ సర్పంచ్ బాలకృష్ణ నాయకులు సాంబశివరావు,రామారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.