జి.మాడుగుల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో వంట పనులు.
ఈ విషయం బయటకు తెలిసి రెండు రోజులు అవుతున్నా స్పందించని జిల్లా స్థాయి అధికారులు
విద్యార్థులతో పనులు చేయిస్తున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేణు ప్రసాద్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పాంగి జీవన్ కృష్ణ డిమాండ్.
అల్లూరి సీతారామరాజు జిల్లా,జి మాడుగుల : జి మాడుగుల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేణు ప్రసాద్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పాంగి జీవన్ కృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ ..గిరిజన ప్రాంతంలో జి మాడుగుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సక్రమంగా పాఠాలు చెప్పకుండా విద్యార్థులను వంట పనులు కూరగాయలు కటింగ్ వంటివి చేయించడం చాలా బాధాకరమని అన్నారు. జి మాడుగుల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, గిరిజన ప్రాంతంలో గురుకుల పాఠశాలు, కాలేజీలకు సంబంధించి పూర్తిస్థాయి వార్డెన్ లేక మూడు నెలలకు ఒకసారి ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుడిని వార్డెన్ గా నియమించి అంతా ప్రిన్సిపాల్ మాత్రమే చూసుకుంటున్నారు అని జీవన్ కృష్ణ అన్నారు. ఏమైనా సమస్య వస్తే గిరిజన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల మీద చర్య తీసుకుంటారని కానీ పూర్తిగా ప్రిన్సిపాల్ మాత్రమే అంతా చూసుకుంటారని, పేరుకు మాత్రమే గిరిజన ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అని కావున జి మాడుగుల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేణు ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఆదివాసి ప్రాంతంలో 11 మండలాల గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సక్రమంగా మెనూ అమలు చేయకుండా, కడుపునిండా భోజనం పెట్టకుండా గురుకుల ఆశ్రమ పాఠశాలల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అందుకే చాలామంది రక్తహీనతతో బాధపడుతూ అనేకమంది మృత్యువాత పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. విద్యార్థులకు పెట్టాల్సిన మెనూ సక్రమంగా ఎక్కడ కూడా అమలు చేయడం లేదని, ప్రజా సంఘాలను గురుకులాలకు, ఆశ్రమ పాఠశాలకు అనుమతించకుండా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని దానికి నిదర్శనమే జి.మాడుగుల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయించుకుంటున్న పరిస్థితి ఉందని విద్యార్థులతో పనులు చేయించుకుంటున్న జి మాడుగుల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేణు ప్రసాద్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవన్ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ విషయం బయటకు తెలిసి రెండు రోజులు అవుతున్నా కనీసం జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు.